BHAGAVATA KADHA-3    Chapters   

ధృతరాష్ట్రునకు విదురుని వైరాగ్యోపదేశము

45

శ్లో|| రాజ9 నిర్గమ్యతాం శీఘ్రం పశ్యేదం భయనూగతమ్‌ |

ప్రతిక్రియా న యస్యేహ కుతశ్చిత్‌ కర్హిచిత్ర్పభో |

స విష భగవా9 కాలః సర్వేషాం సమాగతః ||

-- శ్రీ భాగ. 1 స్కం. 16 ఆ. 19 శ్లో||

''మ || కనకాగార కళత్రమిత్రసుత సంఘాతంబుల9 ముందటంగని ప్రణచ్కఛల నుండు జంతువుల నేకాలంబు దుర్లంఘ్యమై యనివార్యస్థితిఁజంపునట్టి నిరుపాయంబైన కాలంబు వచ్చెనుపాంతంబున మాఱు దీనికి మదింజింతింపు ధాత్రీశ్వరా || ''

-- శ్రీ మదాంధ్ర భాగవతము

ఛప్పయ

ధర్మరూప వే విదుర బంధు తేఁబోలే బానీ |

రాజ9 ! కుటిల కరాల కాల కీ కఛుగతి జానీ?

దేఖో, దౌర్యోఎ కాల నబని కే సమ్ముఖ ఆయో |

చలో, త్యాగి తత్కాల విలమ కస యహాఁలగాయో |

సగే సబహి సురపుర గయే, దేహ జర్జరిత హ్వైగ ఈ|

జీవన ఆశా నా గఈ, అంత సమయ దుర్గతి భఈ ||

అర్థము

ధర్మస్వరూపుడఁగు విదురుండు సోదరుఁడగు ధృతరాష్ట్రునితో నిట్లనెను:- ''రాజా! కుటిల కరాళమగు కాలగతిని గొంచెముగఁ దెలిసికొంటివా? చూడుము, కాలగతి అందఱకు తప్పదు. ఇఁక నాలస్యము చేయక యిది యంతయు వదలి బయలు దేరుము. నీవారందఱును జచ్చిరి. దేహము జర్జరతమైనది. ఇంక నీకు జీవితాశ పోలేదు. ఇట్లున్న నంత్యకాలమున దుర్గతి తప్పదు.

దుఖఃదినములు గడచులట చాలదుర్లభముగ నుండును. సుఖ దినములు గడిచినట్లే తెలియదు. మన మనేక కార్యములచే వ్యగ్రులమై యుందుము, కాని కాలము సదా అవ్యగ్రభావముచేఁ బ్రతీక్షించు చుండవలెను. మనము దారాపుత్ర గృహకుంటుంబాది చఇంతలో మునిఁగి యుండుటచే నసావధానులు మగుచుందుము. కాని కాలము సదా సావధానముగనుండి యంత్యకాలమును గనిపెట్టుకొని యుండును. తామరమీఁద గోఁకుకొనిన సుఖము లభించినట్లు విషయసుఖములలో మనము ప్రవృత్తులమై యందుము, కాని కాల మప్రమత్తతతో మనల వెంబడించు చుండును. మన మాకాశమునఁచ బాతాళమున, భూమియందు, గృహననాదులందు, శయ్యాసన వాహనములందు వీనిలో నెక్కడ నున్నను, కాలము మనలను వదలదు. అది దాని లెక్కను మఱవదు దాని కెవరిమీద నభిమానము లేదున నీవు నీయుద్దేశ్యమును మఱచినను అది తన పనిని మానదు.

బహుకాలమునకు పాపము పాండవులకైశ్వర్యము ప్రాప్తించినది ధర్మరాజు చతుస్సాగర వలయిత వసంఉధరకు ఏక ఛత్రాధిపతి యయ్యెను. సోదరులు, సేవకులు, మంత్రులు, అమాత్యులు ఆతనికి వశవర్తులు. చాల జాగ్రత్తగ నాతని యాజ్ఞలన్నియు నవిలంబముగఁ బాలింపఁబడుచున్నవి. అశ్వమేథయజ్ఞ కారణమున నాతని యశస్పు బువి మొదలు దివి వఱకు వ్యాపించినది. కులదీపకుఁడును, సర్వలక్షణ సంపన్నుఁడు నగు పౌత్రుడు కూడ కలిగినాడు, ద్రౌపది తనపతులను బరమాత్మగభావించి, పూజించి, యాదరించుచుండును. భగవనుగ్రహమున ధన సంపత్తికిలోటులేదు. పాండవవులందఱ మతియు ధర్మరతిని జెంది యుండెను. వారు ధర్మముగ యథేష్టకోరిక లనుభవించుచుండిరి. తమ యాత్రికుల మనోరథము అన్నిఁటిని వారు సఫలీకృతము కావించుచుండిరి. ధృతరాష్ట్రుని వారు తండ్రికండె మిక్కిలిగ నాదరించుచుండిరి. ధర్మరాజు ఉదయముననే తన సోదరలతోఁ గూడ- తన తల్లిదండ్రులతో సమానులగు-- గాంధారీ ధృతరాష్ట్రుల భవనమునకుఁబోయి, యింకను వారు శయ్యపైనుండఁగానే వారికి చరణాభివందనము కావించిర, కుశలప్రశ్నకావించి, ఆదర్శ పతివ్రతయగు గాంధారీ చరణ కమలములకు నమస్కరింతురు. వారామెను గుంతీదేవికంటె మిక్కిలి ఆదరముతోఁ జూతురు. ధర్మరాజుయొక్క యిట్టి ప్రేమపూర్వక వ్యవహారమును గాంచి ఆదంపతులత్యంత సంతుష్టులై ప్రతి దినము వారికి వివిధములగు నాశీర్వాదముల నొసంగుచుండెదరు.

ధర్మరాజు చేతులు జోడించుకొని వారిసన్నిధిని నిలువఁబడి ప్రతికార్యమునకు వారి యాజ్ఞను బ్రతీక్షించును. వారి సౌఖ్యమును గూర్చి యోచించును. శుంతీదేవి తన భవనమును వదలిపెట్టి గాంధారీభవనమునకు బోయెను. ఆమె గాంధారికి తోడి కోడలైనను ఆమెను స్వంత అత్తవలె నాదరించుచుండును. దనాదాసీజనము లెందఱో ఉన్నప్పటికిని ఆమె గాంధారి వలదనినఁ గుంతి కన్నుల నీరుపెట్టుకొని యిట్లనును:- ''అక్కయ్యా! ఈసేవ నాకు చాలకష్టమున దొరికినది. నాకిట్టి సౌభాగ్య మెట్లు లభింపఁగలదు?'' కుంతీదేవిపలుకు ఇట్టి వాక్యములను విని ఆ వృద్ధ దంపతులు లోలోన మిక్కిలి సంతసించుచుందురు.

భేమసేనునిది కొంచెము క్రోధ స్వభావము. ఆతఁడు ధృతరాష్ట్రుని పూర్వ విషయములను జ్ఞపకముచేసిన ధర్మరాజు వానినదలించి తనమీఁద నొట్టుపెట్టుకొని యట్లనును:- ''భీమా! నా తల్లిదండ్రులకంటెను బూజనీయులును, మాననీయులునునగు గాంధారీధృతరాష్ట్రుల సమ్ముఖమున నిట్టి కపటవచనములు పలుకునెడల నిశ్చయముగ నేను రాజ్యమును వదలి యగ్ని ప్రవేశము కావించెదను.'' ఈ భయమున భీమసేనుఁడేమియు ననెడు వాఁడు కాఁడు. ఈ విధముగఁ బాండవుల కాలము మిక్కిలి యానందముగ గడచిపోవు చుండెను. వారు తమ యతులైశ్వర్యముచే దేవదుర్లభమగు భోగములను భోగించుచు రాఁబోవు కాలమును మఱచిరి. కాని కా మూరుకొనునా? అది పాండవుల సమీపమునకు వచ్చెను.

పాండవుల కాలము పూర్తికాఁబోవుచున్నదను సంగతి తన దివ్యదృష్టిచే ధర్మావతారుఁడగు విదురుఁడు కనుఁగొనెను. కాలస్వరూపుఁడగు భగవానుఁ డాతని గొనిపోవుటకు వచ్చి, కొనిపోవుటకు గొప్ప వ్యాకులముతో సిద్ధమొనర్చుచుండెను. ఆతనికి పాండవుల చింత లేదు. కారణము వారికి శ్రీకృష్ణకృప కలదు. ఆతని చింత అంతయుఁదన యన్నగయగు గ్రుడ్డి ధృతరాష్ట్రుని గూర్చియే. ఆతని నింటిలోఁజావనిచ్చుట ఆతని కిష్టము లేదున కాని ధృతరాష్ట్రుఁడు ధర్మరాజు కోరికకు వ్యతిరేకముగఁ బోవఁజాలనంతగ ధర్మరాజు సేవకు ఆతఁడు వశృభూతుఁడై యుండెను.. నిజమగు శుభచింతకులకు అదలించి, బెదరించి, కఠోరవాక్యములు పలికి, ఏదోవిధమునఁదనదారికి హితమొనర్చుటయే పని. వారసంతుష్టులగుదురను భయముచేఁదమ బాంధవులకును, మిత్రులకును హితమును జెప్పక, ముఖస్తుతి చేయు వారు సుహృదులు కాక శత్రువులే యగుదురు. సుహృదుల లక్షణము ఏదోవిధమునఁ దన బంధువులకు మేలుచేయుటయే, విదురుఁడట్టి బంధువే. తన యన్న శీలసంకోచముచే భోగము లందును. సంబంధులయందును అధికాసక్తిని జెందియున్నాఁడను సంగతి తెలిసికొని, ఆతఁడు మధురవాక్కులతో వినఁడని గ్రహించి, కఠోర వాక్కులతోఁజెప్పఁదలఁచెను.

విదురుఁడిట్లనెను:- ''ప్రభూ! నీవిప్పుడిక్కడేల యిరుకుకొంటివి? నీకు బాహ్యనేత్రములు లేకున్నప్పటికి ప్రజ్ఞానేత్రములు కలవు. నీవు నీయెదుటనున్న కాలస్వరూపుఁడగు భగవానుని యెఱుఁగవు? అతి యిప్పుడు నడుముబిగించి మనలను భక్షించుటకు సిద్ధముగ నున్నది?''

ధృతరాష్ట్రుఁడు దుఃఖితుఁడై యిట్లెను:- ''సోదరా! విదురా! నీవు బుద్ధిమంతుఁడవు సమస్త విషయములఁ బండితుఁడవు. ఈ కాలమును గడుచుట కేదైన నుపాయమును జూడుము జప, తప, మంత్ర, యంత్ర, పారాయణాదులతో నేదైనఁబ్రతిక్రియఁగావించి దీనినిఁదాటఁ దలఁచిన ధర్మరాజునకుఁ జెప్పి చేయించుము.''

విదురుఁడు తన మాటలమీఁద నిలువఁబడి యిట్లనెను:- ''రాజా! ఈ కాలము దుర్నివారమైనది. దీనిఁ దొలిఁగించుట కుపాయమేమియు లేదు. ఇది స్థిరమైనది. నశించనది. నీవు నీ మేలు కోరినట్లైన నీ బంధనరూపమగు గృహమును శీఘ్రముగ వీడి తపోవనమునకుఁ బొమ్ము. అట్లు నీవు వెళ్లక, యిచ్చలనే అంటిపెట్టకొని కూర్చుంటివా, యీదుష్టకాలము నీశరీరమును దినివేయఁగలదు. ఈ సామగ్రులన్నియు నిచ్చటనే యిట్లే పబొయుండఁగలవు. అంత్యకాలమునఁ గుటుంబ పరివార చింత పెట్టుకొని చచ్చిన మరల వీరిక పుత్రులమై పుట్టవలసినదే. 'అంతే యామతిః సాగతః' యను న్యాయమును వినవా?''

ధృతరాష్ట్రుఁ డిట్లనెను:- ''విదురా! ఇంకను జావవలెననుకోరిక పుట్టలేదు. ధర్మరాజు నన్నుఁదనప్రేమపాశమున గట్టిగ బంధించినాఁడా.''

విదురుఁడిట్లనెను:- ''ఛీ! ఛీ! ఇంకను నీకు బ్రదుకు నాశ##యే కలదు. నీ తండ్రులు, సోదరులు, మిత్రులు, పుత్రులు వేయేల నందఱును జచ్చిరి. నీయింద్రియము లన్నియు శిథిలములైనవి. దేహము జర్జరితమై పోయినది. ఇట్లున్నను ఇంకను జీవితాశకలదు. పోనిండు, సొంత యిల్లందమా? కాదు. వేఱోకని పంచను పాసినకూడు తిని. రామ! రామ! నీకు ముసలితనములో బుద్ధి యెట్లు బుగ్గియైనది? నీవిట్లైతివని నేననుకొన లేదు.''

ధృతరాష్ట్రుఁడు మిక్కిలి దీనము నిట్లనెను:- ''సోదరా! విదురా! నేఁడు నన్నిట్లాడరాని మాటల నేల పలికెదవు? తమ్ముఁడా! నేనంధుఁడను. నాపుత్రులు, పౌత్రులు, బాంధవులందఱును జచ్చిరి. ఆ దుష్టులు నన్నెల్లప్పుడు దుఃఖపెట్టుచునే యుండిరి. దర్యోధనుఁడు నాకెన్నఁడును శ్రద్ధతో సేవచేయలేదు. యథార్థ పుత్రసుఖము నాకు ధర్మరాజు రాజ్యకాలమున లభించినది. నీవిదివఱలోఁ జెప్పనే చెప్పితివి, కులరక్షకోఱకు దుర్యోధనునిఁ బరిత్యజింపుమని; కాని నేను పుత్రస్నేహముచే నట్లు చేయఁజాలక పోయితిని. ఆతఁడు స్వయముగ దానుజేసిన పాపముచే బంధువులతోఁ జచ్చినాఁడు. ఇప్పుడు నీవు ధర్మరాజుయిటిని పరాయిల్లని పలికెదవేల? ఆతఁడు మాతమ్ముఁడగు పాండురాజుకంటె మిక్కిలిసత్కారము చేయుచున్నాఁడు.''

విధురుఁడత్యంత ప్రేమ రోష స్వరమున గద్దించుచు నిట్లనెను:- ''రాజా! ఈ మాటలు పలుకుటకు నీవు సిగ్గుపడుట లేదా? ధర్మరాజు చేయునది వాని కనురూపముగనే యున్నది. ఆతఁడిట్లు చేయుటచే నాతనికి శోభ. ఆతఁడు ధర్మమర్మములను బాగుగఁ దెలిసినవాఁడు. నీ సేవచే నాతఁడు తన పరలోక సుఖప్రాప్తికి ఉపాయము చూచుకొనుచున్నాఁడు. కాని నీసంగతి నీవాలోచించుకొనవలయునుగదా. నీవాతనితో నిదివఱలో నెట్లు మెలఁగితివి? వారణావతములోఁ బాండవలునులక్కయింటిలోఁ దగులఁబెట్టుమని యజ్ఞాపించిన సంగతి అప్పుడు నీకు తెలియదా? భీమునకు విషముపెట్టి చంపవెనని దుష్టుఁడగు దర్యోధనుఁడు దురాలోచనచేసి లడ్డులోవిషముపెట్టి భీమునిచేఁదినిపించినసంగతి నీకు తెలయకుండనే జరిగినదా? నిండుసభలో సాధ్వియగు ద్రౌపదికి వలువలూడ్చి దుష్టులు నగ్నగఁజేయఁదలచినాఁడు నీవు సింహాసనముమీదఁదఁ గూర్చుండి ఱప్పలార్చుచు మాటిమాటికి 'ఇప్పుడేమి జరిగినది? ఇప్పుడేమి జరిగిన'దరి అడుగుచుంటివే? అప్పుడు పాండవులు నీపుత్రుల కాకపోయిరా? అప్పుడు ద్రౌపది ఏవఁడో వ్లుెచ్ఛుని భార్యాయా? ఇంతయేల? జూద సభ నీ సమ్మతిమీఁదగదా రచింపఁబడినది? పాండవుల రాజ్య, ధనాదులు శకుని మొదలగు దుష్టచతుష్టయముచే నపహరింపఁబడి, నారచీరలు ధరించి యడవులభబట్టినది నీసమ్ముఖముననే కదా! అప్పుడు పాండవులు నీకొడుకులు కాకపోయిరా? అప్పుడు ప్రయత్నము లేకుండఁగనే సర్వము లభించినవి కావున మాట లాడలేదు. ఇప్పుడో, అందఱును జచ్చిరి కావునఁబాండవలు కొడుకులైరి, ద్రౌపతి కోడలైనది. బెల్లమనిన మ్రింగుట, చేదనిన నుమియుట. ఛీ! ఛీ! నేఁటికి నీకు పుత్రస్నేహ ముత్పన్నమైనది. భీముని మనస్సులోని సంగతి నీకు తెలయునా? ధర్మరాజు ఆజ్ఞచే సంకోచవశమున వాఁకిటఁబడియున్న కుక్కకు వేసినట్లు సమస్త పామగ్రులనుర నీకు పడవేయుచున్నాఁడు. నీవు నాకొడుకులు నాకు సేవచేయుచున్నారనుకొనుచున్నావు. రాజా! నీవత్యంత శోచనీయుఁడవు. నీవింతగా శరీరమును బోషించుకొనుచున్నావు. అది యేనాఁడో అకస్మాత్తుగా నిన్ను వదలి వెళ్లిపోఁగలదు. కావున నీమేలుకొఱకై యేదైన చేసికొనుము.''

ధృతరాష్ట్రుఁడిట్లెను:- ''సోదరా! విదురా! నీవు యథార్థమునే చెప్పుచున్నావు. పాండవులతో నేను జేసిన వ్యవహారమును దలఁచుకొనిన నాముఖమును వారికి చూపు యోగ్యతకూడ లేదు. నేనిట్లొనర్చినను బాండవులు నన్ను దండ్రి కంటె నెక్కుడుగఁజూపచి సేవించుచున్నారు. అది వారికనురూపముగనే యున్నది. నేనొర్చిన దుష్టస్వభావముల కనుకూలముగనే యున్నది. సోదరా! నేనిప్పుడేమి చేయవలయునో నీవేచెప్పుము. ఏపనిచేసిన నాకు మేలుకలుగఁగలదు?''

విదురుఁడిట్లనెను:- ''రాజా! ఈ శరీరము శ్రేష్ఠమైనదని లోకములోఁజెప్పుచుందురు. కాని యిది మనమూత్రపు తిత్తి. రోమరోమములనుండి దీనిలోని మలము సర్వదా బయటకు వచ్చుచుండును. దీనిలో నసంఖ్యాకములగు వ్యాధులు పుట్టలుగ నున్నవి. ఈ వ్యాధులవలన వివశుఁడై జీవి యధీరుఁడగును. ఈతఁడు విషయాధీనుఁడై శరీరమందనురక్తి చెందునట్లు గృహ మందనురక్తిచెందును. ఈ జీవి శరీరమే ఆత్మయనుకొని దానిలో బంధింపఁబడి యుండును. ఇట్లే గృహమందుఁగూడ మమకారము కలిగియుండును. ఇంతగాఁ బెంచి పోషించిన శరీరమును వదలి జీవాత్మ వెళ్ళిపోవువఱకే యీ యిల్లు. వాఁకిలి, కుటుంబ పరివారాదలు, కావున నంత్యకాలము రాకమునుపే బుద్ధిమంతుఁడైనవాఁడు మమతా త్యాగము కావించి తపోవనమునకో, తీర్థస్థానమునకో పోయి ఆత్మచింతనము చేసికొనవలయును. అధీరతను బారద్రోలవలయును. ఈ విధముగ నీశరీరమును బ్రయోజనరహితమైనదని తెలిసికొని, మోహబంధమును వీడి, విరక్తి భావముతోఁ గుటుంబములోని వారికి తెలియకుండు నట్లుండి భగవచ్చింతనము చేయుచు నీ శరీరమును వదలినవాఁడు ధీరుఁడని పిలువఁబడును. రాజా! నీవు జ్ఞానివి. ధీరుల మార్గము ననుసరింపుము. ఈ గృహస్థ మోహజాలమును వీడి తపోవనమునకుఁ బొమ్ము.''

ధృతరాష్ట్రుఁ డిట్లనెను:- ''విదురా! అందఱకు నీకు వలె జ్ఞానము రాదు. అందఱును వారంతటవారు గృహమునెట్లు త్యాగము చేయఁగలుగుదురు?''

విదురుఁడిట్లనెను:- కురుకుల తిలకా! త్యాగము లేక కల్యాణము లేదు. ఆసక్తి బంధనహేతువు. కావునఁదనకు దానే కాని, పరుల ఉపదేశము వలనఁగాని, యీ బాహ్య విషయముల యెడల విరక్తినిఁజెంది, హృదయమునుండి సమస్త వాసనలను బారఁద్రోలి, అచ్చట వాసుదేవుని నిలిపి, యెవఁడు గృహమును వదలి వనమునకుఁ బోవుచున్నాఁడో ఆతఁడే మానవులలో శ్రేష్ఠుఁడు. అట్లు కాక చివరవఱకు మోహజాలములఁబడియుండి, పుత్ర పౌత్ర బంధు మిత్రాదుల ముఖమును జూచుచు, మంచముపైఁబడి యుండి, అచ్చటనే చచ్చిన వానికిని పశుపక్ష్యాదులకును భేదమేమున్నది? కావున రాజా! నావు నాప్రార్థనము నంగీకరించి, సంమస్తమును వదలి పరమపావనమగు నుత్తరఖండ పుణ్యభూమికి తరలుము.''

ధృతరాష్ట్రుఁడిట్లనెను:- ''విదురా! ఇంతటి మమతతో నింతటి హితమును జెప్పువారుండుట లోకములోఁజాలదుర్లభము. నీవు నా సోదరుఁడవే కావు, గురుఁడవు, నాకు దేవతవు. అయితే నాయనా! ఈవిషయమును జెప్పుము. ధర్మరాజు నామీఁద సత్యధిక భక్తిశ్రద్ధలు కలవాఁడు. ఆతనితో దీనినిఁ బ్రస్తావించునెడల నాతఁడు నన్నెన్నటికిని బోనీయఁడు. నేను గట్టిగాఁ బట్టుపట్టిన నాతఁడు పసిపిల్లవానివలె నేడ్చుచు, నావెంట రాజ్యాదులను వదలిపెట్టి బయలుదేరును. పాండవులు ముసలి వారైనప్పటికిని నాసమ్ముఖమున వారు బాలకులవలనే వర్తింతురు. నేనేమైనఁ జేయఁగలను గాని ధర్మరాజు దుఃఖించుట చూడఁజాలను. ధర్మరాజు సంతోషపూర్వకముగ నన్నుఁ దపోవనమునకుఁ బంపునట్లేమైన నుపాయమున్న చూడుము.''

విదురుఁడిట్లనెను:- ''ప్రభూ! ధర్మరాజెన్నఁడు నీ కనుమతి యొసంగఁడు. నీవాతనికి చెప్పకయే తెలియకుండ వెళ్లి పోవలయును.''

దుఃఖిచుచు ధృతరాష్ట్రుఁడిట్లనెను:- ''విధురా! నన్ను నీవు చూచుట లేదా? ఎంత ముసలివాఁడనైతినో? జన్మాంధుఁడ నగుటచే నా కుదారికనఁబడదు. పోనిండు, గాంధారి నాకు దారి చూపించుననిన నదియు నామూలమునఁ గన్నులు కలిగియుండియు గ్రుడ్డిదైనది. నాకు తపోవనమార్గమును జూపఁగలవారెవరు? గ్రుడ్డివాఁడనగు నాకఱ్ఱను బట్టుకొనఁ గలవారేరీ?''

విదురుఁ డిట్లనెను:- ''రాజా! ఏమి యిట్లు మాటలాడుచున్నావు. నీ కఱ్ఱను నేను. సోదరుఁడగువాఁడు సమస్త కార్యములందును భుజమునకు భుజమొడ్డి సోదరునకు సహాయము కావింపవలయును. నేను నీకు దారిని జెప్పెదను. తపోవనమునకు గొనిపోవుదును.''

ధృతరాష్ట్రునకు దుఃఖము పొరలి వచ్చెను. ఆతఁడు చేతితోఁదడవి తడవి విదురునిఁ గౌఁగిలించుకొనెను. రుద్ధకంఠముతో, గద్గదస్వరముతోనిట్లనెను:- ''విదురా! అటునిటు నూగు లాడుచు నిలుకడలేని నాజీవన నౌకకు ఏకమాత్ర కర్ణధారుఁడవు నీవే. ఇఁక నిప్పుడు శీఘ్రముగ మనమిచ్చటనుండి వెళ్లిపోవలయును.''

ఈవిధముగ సోదరులిద్దరు నిశ్చయము చేసికొనిరి. ఇప్పుడు వారేదోవిధముగ గృహమును వదలి యెవరికినిఁ దెలియకయే వెళ్లిపోవుటకుఁ బ్రయత్నించుచుండిరి.

ఛప్పయ.

జినకూఁతుమనేదేవ! దుసహ దుఖ దారుణ దీన్హేఁ |

దారా దూషిత కరీ ద్రవ్యహరి భిక్షుక కీన్హేఁ,

శ్వాస సమాన అమాన ఉన్హీఁ కేటుకడే ఖాఓ |

రక్త సురంజిత భోగ భోగ తే నహిఁ లజాఓ ||

చలో ఉత్తరాఖండకూఁ, మోహపాశ ఛేదన కరో|

జన్మ సఫల తపకరి కరో, సబ తజి హరి హియ మేఁధరో ||

అర్థము

ఓధృతరాష్ట్రా! నీవెవరికి దుస్పహ దారుణ దుఃఖములను గలిగించితివో, ఎవరి భార్యను అవమానము చేయించితివో, ఎవరి ద్రవ్యమును హరించి భిక్షకులను జేసితివో అట్టివారి పంచను బడి కుక్కవలెఁగూడు తిని పడియున్నావు. రక్తరంజిత మగు భోగము లనుభవించుటకు నీకు సిగ్గగుటలేదా?

మోహపాశమును ఛేదించి ఉత్తరఖండమునకుఁబోయి జన్మఫలమగుటకు తపస్సుచేయుము. సమస్తమును ద్యాగము కావించి శ్రీహరిని హృదయమున నిలుపుకొనుము.

BHAGAVATA KADHA-3    Chapters